నాగులుప్పలపాడు నుంచి అమ్మనబ్రోలు వెళ్లే ఆర్అండ్ బీ రహదారిలో రోడ్డు అంచులు పూర్తిగా ధ్వంసం కావడంతో పాటు దారి మధ్యలోనూ పెద్ద పెద్ద గోతులు ఏర్పడ్డాయి. ఈ రహదారిలో కళాశాలల బస్సులతో పాటు, జిల్లా కేంద్రం ఒంగోలుకు వెళ్లే వారు నిత్యం రాకపోకలు సాగిస్తుంటారు. ఈ క్రమంలో రహదారిపై ఉన్న గుంతలతో ప్రయాణికులు నానా అవస్థలు పడుతున్నారు. అధికారులు స్పందించి రహదారి అబివృద్ధికి చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.