సార్వత్రిక ఎన్నికల ఫలితాలలో తెలుగుదేశం పార్టీ అధికారం సాధించి అద్దంకి టిడిపి ఎమ్మెల్యేగా గొట్టిపాటి రవికుమార్ అత్యధిక మెజార్టీతో గెలుపొందిన నేపథ్యంలో బుధవారం కొరిసపాడు మండలం మేదరమెట్ల గ్రామంలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు స్థానిక బొడ్డురాయి సెంటర్ వద్ద కేకు కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు. రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే తెలుగుదేశం పార్టీతోనే సాధ్యమని వారు పేర్కొన్నారు.