కర్నూలు మండలం భూపాల్నగర్ పరిధిలో ఉన్న లక్ష్మీనగర్ నీటి ముంపునకు గురైంది. జిల్లా వ్యాప్తంగా భారీ వర్షం కురవడంతో గార్గేయపురం చెరువు నిండిపోయి దిగువ ఉన్న లక్ష్మీనగర్ కాలనీలోకి నీరు చేరుకున్నాయి. తద్వారా ఇళ్లల్లోకి నీరు రావ డంతో స్ధానికులకు రాత్రంతా కంటిపై కునుకు లేకుండా పోయింది. ఓవైపు విద్యుత్ లేక ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. విషయం తెలుసుకున్న కోడు మూరు ఎమ్మెల్యే బొగ్గుల దస్తగిరి, తహసీల్దార్ రామాంజులనాయక్, ఎంపీ డీవో నరసింహనాయుడుతో కలిసి గురువారం ఉదయం నీటిముంపునకు గురైన కాలనీలో పర్యటించారు. వర్షపు నీళ్లు దిగువ ప్రాంతం వైపు వచ్చిన కారణాలను బాధితులను ఎమ్మెల్యే అడిగి తెలుసుకున్నారు. ఇళ్లలోకి నీళ్లు చేరడంతో ధాన్యపు గింజలు తడిసిముద్దయ్యాయని కాలనీ వాసులు వారికి వివరించారు. ఎవరు కూడా అధైౖర్య పడవద్దని అండగా ఉంటానని కోడు మూరు ఎమ్మెల్యే నీటి ముంపు బాధితులకు భరోసా నిచ్చారు. జరిగిన నష్ట్రాన్ని త్వరలోనే ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి అన్ని విధాలుగా ఆదుకుంటామని దస్త గిరి కాలనీ వాసులకు హామీనిచ్చారు. వీరివెంట వీఆర్వో మద్దిలేటి, ఈవోఆర్డీ రామచంద్రారెడ్డి, స్థానిక టీడీపీ నాయకులు ఉన్నారు.