అరాచక వైసీపీ ప్రభుత్వంపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అలుపెరగని పోరాటం చేశారని.. అందుకే ప్రజలు ఆయనకు వందకు వంద శాతం ఓట్లేసి గెలిపించారని బీజేపీ ధర్మవరం ఎమ్మెల్యే సత్యకుమార్ పేర్కొన్నారు. ఐదేళ్లుగా సంక్షేమం పేరుతో చేసిన మోసానికి వ్యతిరేక ఓటు కూటమికి పడిందన్నారు. కరోనా తర్వాత ఏ దేశం సాధించని ఆర్థిక అభివృద్ధి మోదీ హయాంలో భారత్లో సాధించామన్నారు. ఒరిస్సాలో బీజేపీ సొంతంగా ప్రభుత్వం ఏర్పాటు చేస్తూనే ఇక్కడ కూటమిలో టీడీపీ అధినేత చంద్రబాబు హయాంలో సాధించిన విజయాలు ఒక రికార్డ్ అని తెలిపారు.