టీడీపీ, జనసేన, బీజేపీ పార్టీల నాయకులు, కార్యకర్తలు, అభిమానులు.. సైనికుల్లా పని చేయడం, జగ న్మోహనరెడ్డి పాలనని ప్రజలు ఛీ కొట్టడంతో తమ పార్టీ భారీ మెజా ర్టీతో గెలిచిందని గుంటూరు తూర్పు ఎమ్మెల్యే నసీర్ చెప్పారు. ఎమ్మెల్యేగా ఎన్ని కైన తరువాత తొలిసారిగా ఆయన విలేకరులతో మాట్లాడారు. భారతీయ జనతా పార్టీని బూచిగా చూపించినప్పటికీ ముస్లింలు కూటమికి పట్టం కట్టారని కొనియాడారు. గుంటూరు నగర పాలక సంస్థలో అర్థరాత్రి అవినీతి ఫైళ్ళు కదులుతున్నాయని, ఎక్కడ తేడా జరిగినా అధికారులతో పాటూ గత పాలకులు ఇబ్బందులు పడాల్సి ఉంటుందని హెచ్చరించారు.