ఈనాడు సంస్థల అధినేత,రామోజీ గ్రూప్ ఆఫ్ ఛైర్మెన్ రామోజీరావు మృతి చెందిన సందర్భంగా ఎమ్మిగనూరు నియోజకవర్గ శాసన సభ్యులు జయనాగేశ్వర రెడ్డి ఆదేశాల మేరకు పట్టణంలోని స్థానిక తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో చిత్రపటానికి ,ఘనంగా నివాళులర్పించారు.తెలుగు రాష్ట్రాలకు,దేశానికి చేసిన సేవలను గురించి స్మరించుకుంటూ సామాన్య కుటుంబంలో జన్మించి ఎన్నో అపజయాలను తట్టుకొని నిలబడి అనేక విజయాలను అందుకున్నారని గుర్తు చేశారు.