ఈనాడు గ్రూప్ సంస్థల చైర్మన్ చెరుకూరి రామోజీరావుకు భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు నివాళులు అర్పించారు. ఎం. వి. పి. కాలనీలోని తన నివాసంలో శనివారం రామోజీరావు సంతాప సభ నిర్వహించారు. రామోజీరావు భౌతికంగా మన మధ్య లేకపోయినప్పటికీ తెలుగు ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోతారని ఈ సందర్భంగా గంటా అన్నారు. పత్రిక భాష స్థానంలో సామాన్యుడికి అర్థమయ్యే వాడుక భాషలో వార్తలను అందించి అందరికీ చెరువయ్యారని తెలిపారు.