రైలు ఢీకొన్న సంఘటనలో యువకుడు శనివారం మృతిచెందాడు. రైల్వే పోలీసుల కథనం మేరకు.. పార్వతీపురంలోని బెలగాం పరిధిలోగల బూరాడ వీధికి చెందిన తెంటు భరత్(31) మండలంలోని విశ్వంబరపురంలోని బంధువుల ఇంటికి వెళ్లేందుకు రైలు పట్టాలు దాటు తున్నాడు. ఆ సమయంలో బొబ్బిలి వైపు నుంచి వస్తున్న గూడ్స్ రైలు ఢీకొన డంతో మృతి చెందాడు. ఈ మేరకు కేసునమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు రైల్వే హెచ్‌సీ రత్నకుమార్ తెలిపారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa