ఓట్ల లెక్కింపు రోజు నుంచి జగ్గయ్యపేట నియోజకవర్గంలో వైసీపీ నాయకులు, కార్యకర్తలపై టిడిపి నేతలు ఉద్దేశ పూర్వకంగా విధ్వంసం సృష్టిస్తున్నారు. జగ్గయ్యపేట పట్టణానికి చెందిన కొందరు టిడిపి కార్యకర్తలు తొర్రగుంటపాలెంకు వైఎస్ఆర్సిపి కార్యకర్త పాటి సాంబ ఇంటిలోకి ఆదివారం తెల్లవారుజామున చొరబడి ఇంట్లోని విలువైన వస్తువులను ధ్వంసం చేశారు. బాధితులు జగ్గయ్యపేట సిఐ జానకి రామ్ కి లిఖిత పూర్వకంగా ఫిర్యాదు చేశారు.