టీడీపీ అరాచకం చేయాలనుకుంటే వైసీపీ నేతలు ఎవరూ మిగలరు. అది మా పందా కాదు... మా అధినేత దానికి ఒప్పుకోరు అని వర్లరామయ్య అన్నారు. అరాచకానికి సహకరించిన అధికారులు ఎవరిని వదిలిపెట్టేది లేదు. ఓట్లు వేయలేదని ఏడుపు ముఖంతో జగన్ మాట్లాడతున్నాడు. జగన్ రెడ్డి ఏం చేశాడని జనం ఓట్లు వేస్తారు. అందుకే దళితులందరూ ఏకతాటిపైకి వచ్చి ఓడించారు. జగన్ ముఖ్యమంత్రిత్వాన్ని అడ్డుపెట్టుకుని కోర్టులను కూడా తప్పుదారి పట్టించారు. సీబీఐ దాఖలు చేసిన 11 ఛార్జిషీట్ లలో ఒక్క రోజు కూడా కోర్టుకు హాజరు కాలేదు. జగన్ రెడ్డి ప్రతి శుక్రవారం కోర్టుకు హాజరు కావాలి... సీఐబీ ప్రతి రోజు విచారణ జరిపించాలి. రాష్ట్ర ప్రజలకు అనుమానం ఉన్నది జగన్ రెడ్డి ఎందుకు ఇంత వెసులుబాటు కల్పించారో కోర్టు క్లారిటీ ఇవ్వాలి. ఆయన మీద ఉన్న 11 కేసుల్లో వెంటనే విచారణ చేపట్టి నిర్ధోషి అయితే వదిలేయాలి.. దోషి అయితే అరెస్ట్ చేయాలి. రాష్ట్ర ప్రజలు ఉత్కంఠతో ఉన్నారు...జగన్ రెడ్డి లోపల బయట అనేది త్వరితగతిన కోర్టులు న్యాయ విచారణ జరపాలి. జగన్ ఇకనైనా ముసలి కన్నీరు ఆపాలి... జగన్ రెడ్డి భవిష్యత్‌లో చెల్లించాల్సింది చాలా ఉంది అని వర్లరామయ్య పేర్కొన్నారు.