విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో టీడీపీ గూండాలు రెచ్చిపోయారు. అజిత్‌సింగ్‌నగర్ లూనా సెంటర్లో వైయస్ఆర్సీపీ కార్యకర్త భాషా టైలరింగ్ దుకాణంపై దాడి చేశారు. రెండు టైలరింగ్ దుకాణాలను ధ్వంసం చేసిన టీడీపీ గూండాలు.. దుకాణంలోని టైలరింగ్ మెషీన్లు, ఎల్ఈడీ టీవీ, ఫర్నిచర్ ధ్వంసం చేశారు. బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దాడిలో టీడీపీ కార్యకర్త వేల్పుల విజయ్‌బాబుతో పాటు మరికొంత మంది పాల్గొన్నట్లు పోలీసులు గుర్తించారు. వేల్పుల విజయ్ బాబుతో పాటు ఆరుగురిపై అజిత్‌సింగ్ పోలీసులు కేసు నమోదు చేశారు.