కంచిలి మండలంలోని కొక్కిలి పుట్టుగ పంచాయతీ పరిధి నాధపుట్టుగ గ్రామంలో వెలిసియున్న స్వయంభు మహంకాళి ఆలయం వార్షికోత్సవం ఆదివారం ఘనంగా నిర్వహించారు. గ్రామంలోని మహిళలు అమ్మవారికి అభిషేకాలు, ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా విచ్చేసిన భక్తులకు తీర్థప్రసాదాలు అందజేశారు. ఆలయ అభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలలో పలువురు పాల్గొన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa