నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ విడుదల చేసిన నీట్ పరీక్షా ఫలితాలపై, పేపర్ లీకేజీపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని ఏఐఎస్‌ఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె.శివారెడ్డి డిమాండ్ చేశారు. అఖిల భారత విద్యార్థి సమాఖ్య కాకినాడ జిల్లా సమితి ఆధ్వ ర్యంలో ఆదివారం స్థానిక పీఆర్ భవన్‌లో ము ఖ్య నాయకుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా శివారెడ్డి మాట్లాడుతూ ఈ పరీక్షా ఫలితాల్లో దేశవ్యాప్తంగా 67మంది విద్యార్థులకు 720 మార్కులకు 720 మార్కులుు వస్తే అందు లో 6 గురు విద్యార్థులు హర్యానా లోని ఒకే సెంటర్‌కు చెందినవారు కావడం అనుమానాలు కలిగిస్తోందన్నారు. తక్షణం ఎన్టీఏ విడుదల చేసిన ఫలితాలపై కేంద్ర ప్రభుత్వం స్పదించి మెడికల్ విద్యార్థులకు న్యాయం చేయాలన్నారు. ఆంధ్రప్రదేశ్ ఉన్నత విద్యామండలి చైర్మన్ హేమచంద్రరెడ్డి డిగ్రీ విద్యార్థుల ఇంటెన్షిప్ చేయడానికి ఎలాంటి టెండర్ పిలవకుండా తన అనుకూల సాఫ్ట్‌వేర్ కంపెనీలకు ముడుపులు తీసుకుని అప్పజెప్పారని, తక్షణం విచారణ జ రిపి కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. అనం తరం జులై 8,9,10న కాకినాడ సూర్యకళా మం దిరంలో నిర్వహించనున్న రాష్ట్రస్థాయి విద్య,. వైజ్ఞానిక, రాజకీయ శిక్షణా తరగతుల కరపత్రా లను సీపీఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు తాటిపాక మధు, ఏఐఎస్‌ఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శివారెడ్డి ఆవిష్కరించారు. సమావేశంలో ఏఐఎస్ ఎఫ్ ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా అధ్యక్ష కార్యదర్శిలు గండి రవి, చింతలపూడి సునీల్, జిల్లా నాయకులు వెంకట్, మోహన్, దుర్గ, రవితేజ, సునీల్ తదితరులు పాల్గొన్నారు.