పిఠాపురంలో జనసేన గెలుపు కోసం తీవ్రంగా శ్రమించిన మాజీ ఎమ్మెల్యే వర్మపై కాకినాడ జిల్లా గొల్లప్రోలు మండలం వన్నెపూడిలో జరిగిన దాడిని పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సీరియస్గా తీసుకున్నారు. ఈ సంఘటన వెనుక ఎవరున్నారు..? అనే దానిపై వివరాలు సేకరించాలని ఆదేశించారు. దీనిపై విచారణ జరిపే బాధ్యతలను పిఠాపురం కో-ఆర్డినేటర్ మర్రెడ్డి శ్రీనివాస్ అప్పగించారు. ప్రస్తుతం ఆయన నరేంద్ర మోదీ ప్రమాణ స్వీకార కార్యక్రమంలో పాల్గొనేందుకు టీడీపీ అధినేత చంద్రబాబుతో కలిసి ఆదివారం ఢిల్లీ వెళ్లారు. అక్కడి నుంచి వచ్చిన తర్వాత ఈ నెల 12న జరిగే చంద్రబాబు ప్రమాణ స్వీకార కార్యక్రమంలో బిజీబిజీగా ఉంటారు. అనంతరం ఆయన పిఠాపురం వెళ్లి అక్కడ పరిస్థితిని చక్కదిద్దనున్నారు. ఈ లోగా సంఘటనకు కారణాలు, ఇతర అంశాలపై పార్టీ కో-ఆర్డినేటర్ శ్రీనివాస్ నివేదిక సిద్ధం చేయాని ఆదేశించారు. ఆ నివేదిక ఆధారంగానే పార్టీకి సంబంధించిన వ్యక్తులు ఈ ఘటనలో పాలొన్నట్టు తెలిస్తే మాత్రం వారిపై తీవ్ర చర్యలు ఉంటాయన్న హెచ్చరికలు పంపించారు. తప్పు చేసిన ఎంతటి వారైనా ఉపేక్షించది లేదని పార్టీ ప్రధాన కార్యదర్శి కె.నాగబాబు ఇప్పటికే హెచ్చరించారు. అధినేత పవన్ కల్యాణ్ వచ్చిన తర్వాత ఘటనపై తుదినిర్ణయం తీసుకోనున్నారు.