ఉపాధ్యాయుడు ఆత్మహత్య చేసుకుని మృతి చెందిన ఘటన పార్వతీపురం మండలంలో చోటుచేసుకుంది. దీనికి సంబంధించి రూరల్ ఎస్ఐ దినకరన్ తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. పార్వతీపురం మండలంలోని చిన్నబొండపల్లి గ్రామంలో సిత్త పాపారావు(45) మండలంలోని చందలంగి గ్రామంలో ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్నాడు. ఈ క్రమంలో గ్రామంలో ఓ చెట్టుకు ఉరివేసుకుని సోమవారం ఉదయం కనిపించాడు. పాపారావుకు భార్యతో పాటు ఇద్దరు కుమారులు ఉండగా, ఒక కుమారుడికి వివాహమైంది. ఈ ఘటనకు పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. దీనిపై రూరల్ ఎస్ఐ దినకరన్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.