టీడీపీ అధినేత నారా చంద్రబాబు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. మంగళవారం జరిగిన ఎన్డీఏ సమావేశంలో చంద్రబాబు మాట్లాడుతూ.. తప్పు చేసిన ఏ ఒక్కరినీ వదిలిపెట్టబోమని హెచ్చరించారు. ఎందుకు వదిలిపెట్టకూడదనే దానిపై కూడా క్లారిటీ ఇచ్చారు. తప్పు చేసిన వారిని వదిలిపెడితే అదొక అలవాటుగా మారిపోతుందన్నారు. అందుకే చట్టపరంగా వారిని కచ్చితంగా శిక్షించాల్సిన అవసరం ఎంతైనా ఉందని చంద్రబాబు అన్నారు. విధ్వంస, కక్ష రాజకీయాలకు దూరంగా ఉండాలని టీడీపీ శ్రేణులకు ఈ సభావేదికగా హెచ్చరించారు. అంతేకాదు.. పదవి వచ్చిందని విర్రవీగొద్దని వినయంగా మాత్రమే ఉండాలని ఈ ఎన్నికల్లో గెలిచిన ఎమ్మెల్యేలకు చంద్రబాబు సూచించారు. కాగా.. ఎన్నికల్లో, ఫలితాల తర్వాత ఏపీలో జరుగుతున్న గొడవల నేపథ్యంలో చంద్రబాబు ఈ వ్యాఖ్యలు చేసినట్లుగా తెలుస్తోంది.