శ్రీసత్య సాయి జిల్లా పెనుకొండ ఎమ్మెల్యే ఎస్. సవితమ్మ బుధవారం రాష్ట్ర మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. విజయవాడలో రాష్ట్ర గవర్నర్ అబ్దుల్ నజీర్ సవితమ్మ చే మంత్రిగా ప్రమాణ స్వీకారం చేయించారు. తొలిసారిగా ఎమ్మెల్యేగా గెలుపొంది మంత్రిగా సవితమ్మ ప్రమాణ స్వీకారం చేయడం పట్ల పెనుకొండ నియోజకవర్గంలోని టీడీపీ, జనసేన, బీజేపీ పార్టీ నాయకులు, కార్యకర్తలు హర్షం వ్యక్తం చేశారు.