హింసాత్మక ఘటనలకు పాల్పడితే చట్టపరమైన చర్యలు తప్పవని డీఎస్పీ బి. శ్రీనివాసులు హెచ్చరించారు. జిల్లా ఎస్పీ గౌతమిసాలి ఆదేశాలతో కళ్యాణదుర్గం మండలం ఒంటిమిద్దె గ్రామంలో గురువారం కేంద్రసాయుధ బలగాలచే ఫ్లాగ్ మార్చ్ నిర్వహించారు. గ్రామంలోని ప్రధాన రహదారి, కాలనీలలో కవాతు కొనసాగించారు. డిఎస్పీ మాట్లాడుతూ యువత సంయనంతో ఉండాలని కేసుల్లో ఇరుక్కుపోతే భవిష్యత్తు నాశనమవుతుందన్నారు. సిఐ హరినాథ్, పోలీసులు పాల్గొన్నారు.