ఉమ్మడి జిల్లాలోని ఏపీ సాంఘిక సంక్షేమ (అంబేడ్కర్) గురుకులాల్లో ఖాళీగా ఉండే ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి చర్యలు తీసుకుంటున్నట్లు గురుకులాల సమన్వయ అధికారి అంగడి మురళీకృష్ణ తెలిపారు. ఈ మేరకు గురువారం ఓ ప్రకటన విడుదల చేశారు. డెమో ద్వారా తాత్కాలిక ప్రాతిపదికన గెస్ట్/పార్టమ్ టీచర్స్ పోస్టులను భర్తీ చేస్తామన్నారు. ఆసక్తి గల వారు ఈనెల 15న కురుగుంట అంబేడ్కర్ గురుకుల పాఠశాలలో జరిగే ఇంటర్వ్యూకు హాజరుకావాలన్నారు.