ప్రకాశం జిల్లా మార్కాపురం మున్సిపాలిటీ పరిధిలో తర్లపాడు రోడ్డు నుండి భగత్ సింగ్ కాలనీ వెళ్లే రహదారిలోని సైడ్ కాలువలలో చెత్తాచెదారం నుండి స్థానిక ప్రజల అవస్థలు పడుతున్నారు. ఈ వార్డులో గత కొన్ని రోజులుగా పారిశుద్ధ్య కార్మికులు పనిచేయకపోవడంతో మురుగు కాలువలు చెత్తాచెదారంతో నిండిపోయి స్థానిక ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు తగు చర్యలు తీసుకోవాలని గురువారం స్థానికులు కోరారు.