కళ్యాణదుర్గం పట్టణంలో స్థానిక ఆర్. అండ్. బి. అతిథి గృహం ముందు బళ్ళారి రోడ్డులో ఉన్న అన్నా క్యాంటీన్ ను శుక్రవారం కళ్యాణదుర్గం ఎమ్మెల్యే అమిలినేనీ సురేంద్రబాబు పరిశీలించారు. ఆయన మాట్లాడుతూ అన్నా క్యాంటీన్ ను వచ్చే జులై చివర్లో కాని ఆగస్టు మాసంలో కానీ పూర్తి చేసి పేదలకు అన్నం పెట్టే కార్యక్రమం త్వరలోనే మొదలు పెడతామని తెలిపారు. ఈ కార్యక్రమంలో టిడిపి నేతలు, కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు.