కృష్ణా జిల్లా, కృత్తివెన్ను వద్ద జాతీయ రహదారి 216పై నేడు ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో ఆరుగురు అక్కడికక్కడే మృతి చెందారు. ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం మచిలీపట్నంలోని ఓ ఆసుపత్రికి తరలించారు. కారు డ్రైవర్ నిద్ర మత్తులో ఉన్నాడో లేదంటే మరో కారణమో కానీ జాతీయ రహదారిపై కంటైనర్‌ను ఢీకొట్టాడు. కృత్తివెన్ను మండలం సీతనపల్లి దగ్గర ఘటన చోటు చేసుకుంది.