అన్ని సామాజికవర్గాల అభివృద్ధే ధ్యేయంగా ప్రభుత్వం పనిచేస్తుందని వినుకొండ ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు అన్నారు. ఈపూరు మండలంలోని కొచ్చెర్ల గ్రామంలో తెలుగు యువత నాయకులు తిరుమల- తిరుపతికి చేపట్టిన పాదయాత్రను మాజీ ఎమ్మెల్యే మక్కెన మల్లికార్జురావుతో కలసి ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు ప్రారంభించారు. ముందుగా గ్రామ దేవత కొచ్చెర్ల అంకాళ పరమేశ్వరి అమ్మవారికి ఆంజనేయులు, మక్కెన, జనసేన నాయకులు శ్రీనివాసరావులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా వారిని గ్రామస్తులు శాలువాలతో ఘనంగా సత్కరించారు. ఈ సందర్బంగా ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు మాట్లాడుతూ..... గ్రామాభివృద్ధి కోసం రాజకీయాలకు అతీతంగా సంక్షేమ అబివృద్ధి పథకాలను అర్హులందరికీ చేరేటట్లు కృషి చేస్తామన్నారు. నియోజకవర్గంలోనే అత్యథిక మెజారిటీ తీసుకువచ్చిన కొచ్చెర్ల గ్రామ ప్రజలకు తానెప్పుడు రుణపడి ఉంటానన్నారు. కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షులు తిరుమలశెట్టి బాలయ్య, న్యాయవాది నలబోతు రామకోటేశ్వరరావు, ఐనాల కోటేశ్వరరావు, నెల్లూరి శాంతారావు, శీలం నరశింహారావు, నిశ్శంకర అంకారావు, పిచ్చయ్య, తూమాటి రామకోటేశ్వరరావు, తదితరులు పాల్గొన్నారు.