ఫుదుచ్చేరి రాష్ట్రం మద్యాన్ని ఒంగోలులో విక్రయిస్తున్న ముగ్గురిపై నేరం రుజువుకావడంతో నిందితులకు ఒక్కొక్కరికి రెండేళ్ళు జైలు, రూ.2లక్షలు జరిమాన విధిస్తూ ఎక్సైజ్ కోర్టు న్యాయమూర్తి ఎస్.కోమల వల్లి గురువారం తీర్పు ఇచ్చారు. వివరాలోకి వెళితే.. ఒంగోలు నగరం సీతారామపురంనకు చెందిన శెట్టి శ్రీకాంత్, శెట్టి వంశీ, పోతూరి అమృతరాజుపై 2021 జూలై 25న సెబ్ ఇన్‌స్పెక్టర్ కేసు నమోదు చేశారు. వారు ముగ్గురు స్థానిక సీతారామాపురంలో వీధిలోని ఓ ఇంటిని అద్దెకు తీసుకొని పుదుచ్చేరి మద్యం విక్రయిస్తూ 42ఫుల్ బాటిళ్ల మద్యంతో పట్టుబడ్డారు దీంతో వీరిపై కేసు నమోదు చేసిన సెబ్ ఇన్‌స్పెక్టర్ అప్పటిలో అరెస్టు చేశారు. ఈ కేసును ఎక్సైజ్ కోర్టులో విచారించిన న్యాయమూర్తి ఈమేరకు తీర్పు ఇచ్చారు. ప్రాసిక్యూషన్ తరుపున ఏపీపీ శ్రావణ్‌కుమార్ వాదనలు వినిపించారు.
![]() |
![]() |