జమ్మూ-కశ్మీర్‌లోని వైష్ణోదేవి ఆలయానికి వెళ్తున్న హిందూ యాత్రికులపై నిర్ధాక్షిణ్యంగా కాల్పులకు తెగబడిన ఉగ్రమూకలను అరెస్టు చేసి, బహిరంగంగా ఉరితీయాలంటూ వీహెపీ, బజరంగదళ్ ప్రతినిధులు కేంద్రప్రభుత్వాన్ని కోరారు. ఈ మేరకు వారు గురువారం ధర్మవరం పట్టణంలోని కాలేజీ సర్కిల్ నుంచి ఎన్టీఆర్ సర్కిల్ వరకు ర్యాలీ చేపట్టారు. అనంతరం అక్కడ నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు. పాకిస్థాన ఉగ్రవాద దిష్టిబొమ్మను దహనం చేశారు. ఉగ్రవాదులను వెంటనే అరెస్టు చేసి ఉరితీయాలని కోరారు. కార్యక్రమంలో నరసింహారెడ్డి, అంజి, దూలెప్ప, హరి తదితరులు పాల్గొన్నారు.