ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు ఆదేశాలతో మచిలీపట్నం ప్రభుత్వ ఆసుపత్రిలో కృత్తివెన్ను రోడ్డు ప్రమాద క్షతగాత్రులను మంత్రి కొల్లు రవీంద్ర పరామర్శించారు. మృతుల కుటుంబాలకు ముందస్తుగా రూ.5లక్షలు ఎక్స్గ్రేషియా ప్రకటించారు. శుక్రవారం తెల్లవారుజామున కంటైనర్, మినీ వ్యాన్ ఢీకొని ఆరుగురు మృతి చెందగా.. నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి. జిల్లా కలెక్టర్, ఎస్పీ, మాజీ ఎంపీ కొనకళ్ల నారాయణరావులతో కలిసి జిల్లా ప్రభుత్వాస్పత్రిలో చికిత్స పొందుతున్న క్షతగాత్రులను మంత్రి కొల్లు రవీంద్ర పరామర్శించారు.