కొన్నేళ్లుగా పంట కాల్వలు, సైడ్ కాల్వల పూడికతీతల నిర్లక్ష్యంతోనే రైతులు, ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారని పౌర సరఫరాల శాఖా మంత్రి నాదెండ్ల మనోహర్ అన్నారు. తెనాలి పట్టణంలో ముత్తంశెట్టివారిపాలెం వద్ద తూర్పు కాల్వలో, మరికొన్నిచోట్ల కాల్వల్లో వ్యర్ధాలు తొలగింపు, పూడికతీత పనులను శుక్రవారం ఆయన పరిశీలించారు. వర్షాకాలం రానున్న దృష్ట్యా యుద్ధ ప్రాతిపాదికన పూడికతీత పనులు చేపట్టినట్లు చెప్పారు.