మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి అమలు చేసిన ఏపీ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ను ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు రద్దు చేయడం హర్షనీయమని విశాఖ పార్లమెంట్ తెలుగు రైతు అధ్యక్షులు తిక్కాన చినదేముడు శనివారం ఓ ప్రకటనలో తెలిపారు. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ కారణంగా రైతులు తీవ్ర ఇబ్బంది పడే పరిస్థితి నెలకొన్న నేపథ్యంలో సీఎం చంద్రబాబు ఆ యాక్ట్ ను రద్దు చేయడంతో రైతులు, సామాన్యులకు మేలు జరుగుతుందన్నారు.