అంబేద్కర్ కోనసీమ జిల్లాలో బోరుబావి నుంచి గ్యాస్ లీక్ అవుతోంది. కోనసీమ జిల్లా రాజోలు మండలం చింతలపల్లి గ్రామంలో ఈ ఘటన జరిగింది. స్థానికంగా ఉన్న ఓ బోర్ బావి నుంచి గ్యాస్ వెలువడటంతో స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.స్థానికంగా ఉన్న .విజయేంద్రవర్మ అనే రైతుకు చెందిన ఆక్వా చెరువుల వద్ద గతంలో బోరు బావి వేశారు. అయితే నీరు పడకపోవటంతో ప్రస్తుతం వాడకంలో లేదు. అయితే ఈ బోరు బావి నుంచి శనివారం నీటితో కూడిన గ్యాస్ విడుదలైంది. ఏకంగా15 మీటర్లు పైకి గ్యాస్ ఎగజిమ్ముతోంది. దీంతో గ్రామస్థులు భయపడిపోయారు. చుట్టుపక్కల ఉన్నవారు ఇళ్లు వదిలి వేరే ప్రాంతాలకు వెళ్లిపోయారు.
మరోవైపు బావి నుంచి భారీగా గ్యాస్ ఎగజిమ్ముతుండటంతో స్థానికులు అధికారులకు సమాచారం అందించారు. మరోవైపు కోనసీమ ప్రాంతంలో అప్పుడప్పుడూ ఇలాంటి ఘటనలు జరుగుతూ ఉంటాయి. గెయిల్, ఓఎన్‌జీసీ వంటి సంస్థలు ఈ ప్రాంతంలో కార్యకలాపాలు సాగిస్తున్నాయి. ఈ నేపథ్యంలో అప్పుడప్పుడూ ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయి. అయితే తాజా ఘటనపై స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వెంటనే చర్యలు తీసుకోవాలని కోరారు. అయితే బోరు బావి నుంచి గ్యాస్ వెలువడుతున్న వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. వాటర్ ఫౌంటేన్ తరహాలో గ్యాస్ విరజిమ్ముతోంది. ఈ వీడియోను చూస్తున్న నెటిజనం.. వెంటనే రక్షణ చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచిస్తున్నారు. మరోవైపు అప్పుడప్పుడూ ఇలాంటి ఘటనలు జరుగుతూ ఉండటంతో గ్యాస్ కంపెనీల అధికారులు పటిష్టమైన చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు. ప్రమాదం జరిగిన తర్వాత బాధపడటం కంటే ముందే అప్రమత్తం కావటం మంచిదని కోరుతున్నారు.
![]() |
![]() |