అనంతపురం రూరల్ మండలం ఆకుతోటపల్లి గ్రామానికి చెందిన టీడీపీ సీనియర్ నాయకుడు నారాయణ అనారోగ్యంతో మరణించారు. విషయం తెలుసుకున్న రాప్తాడు ఎమ్మెల్యే పరిటాల సునీత టీడీపీ నాయకులతో ఆదివారం కలిసి వెళ్లి నారాయణ భౌతికకాయాన్ని సందర్శించి నివాళులు అర్పించారు. అనంతరం వారి కుటుంబ సభ్యుల ఓదార్చే పార్టీ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు.