చెన్నేకొత్తపల్లి మండలం ముష్టి కోవెల గ్రామానికి చెందిన నాగరాజు (55) అనే వ్యక్తి చింత చిగురు కోసం వెళ్లి ప్రాణాలు కోల్పోయాడు. గత నెల 28న చింత చిగురు కోసేందుకు వెళ్లి ప్రమాదవశాత్తు చెట్టు పై నుంచి కిందపడి తీవ్రంగా గాయపడ్డాడు. మెరుగైన వైద్యం కోసం బెంగళూరులోని హాస్పిటల్ కు తీసుకెళ్లగా అక్కడ చికిత్స పొందుతూ శనివారం రాత్రి మరణించాడు.
![]() |
![]() |