అనంతపురములోని లలిత కళా పరిషత్ లో శ్రీ రాజేశ్వరీ పదన్యాస నృత్యాలయం ఆధ్వర్యంలో ఉచిత వేసవి శిక్షణా ముగింపు కార్యక్రమం ఈ నెల 16 న సాయంత్రం 6 గంటలకు నిర్వహిస్తున్నామని నాట్యాచార్యులు డి. రమ్యక్రిష్ణ తెలిపారు. ఈ సందర్బంగా ఆదివారం ఆమె మాట్లాడుతూ నృత్య కళను విద్యార్థులకు అందివ్వాలని వేసవి సెలవులలో ఉచితంగా శిక్షణ ఇచ్చామని అన్నారు. శిక్షణ తీసుకున్న విద్యార్థులచే నాట్య ప్రదర్శణను నిర్వహిస్తున్నామన్నారు.