హిందూపురం మండలం కిరికెరలోని ఎల్ఆర్ పబ్లిక్ స్కూల్లో శనివారం పెట్టుబడి వేదిక కార్యక్రమం జరిగింది. ముఖ్య అతిథిగా హాజరైన ప్రభుత్వ ఆసు పత్రి చీఫ్ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ హరీష్ కుమార్ మాట్లాడుతూ. పిల్లలకు విద్య, ఆరోగ్యం అనే పెట్టుబడిని అందించే బాధ్యత తల్లిదండ్రులపై ఉంటుందన్నారు. తద్వారా విద్యార్థులు భావిపౌరులుగా ఎదుగుతారన్నారు. ఇందులో ప్రిన్సిపల్ భారతి విద్యార్థులు వారి తల్లిదండ్రులు పాల్గొన్నారు.