ధర్మవరం నియోజకవర్గంలో ఎక్కడా రైతులకు వేరుశనగ విత్తనకాయలు కొరత లేకుండా చూడాలని వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి సత్య కుమార్ యాదవ్ వ్యవసాయ శాఖాధికారులను ఆదేశించారు. శనివారం విత్తనకాయలు నేటికీ సరిగా అందలేదని పలువురు రైతులు మంత్రి కార్యాలయం దృష్టికి తీసుకెళ్లారు. దీనిపై స్పందించిన మంత్రి. జిల్లా డీఏఓ సుబ్బారావుతో చరవాణిలో సంప్రదించారు. అర్హులైన ప్రతి రైతుకు రాయితీ విత్తనకాయలు అందేలా చూడాలన్నారు.
![]() |
![]() |