హిందూపురం అసెంబ్లీ నియోజకవర్గం ఎమ్మెల్యేగా నందమూరి బాలకృష్ణ మూడోసారి అత్యధిక మెజార్టీతో హ్యాట్రిక్ విజయం సాధించిన సందర్భంగా హర్షం వ్యక్తం చేస్తూ పట్టణానికి చెందిన ఎండీఎస్ సోదరులు హిందూపురం మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికులకు శనివారం దుస్తులు అందజేశారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం సీనియర్ నాయకుడు పీరూసాబ్, ఎండీఎస్ సోదరులు హిదయతుల్లా, ఇందాద్ పాల్గొన్నారు.