ముస్లిం సోదర సోదరీమణులకు వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, మాజీ ముఖ్యమంత్రి వైయస్.జగన్ మోహన్‌రెడ్డి బక్రీద్ శుభాకాంక్షలు తెలియజేశారు. త్యాగనిరతికి, ధర్మబద్ధతకి, దాతృత్వానికి బక్రీద్ ప్రతీకగా నిలుస్తుందన్నారు. దైవ ప్రవక్త ఇబ్రహీం త్యాగాన్ని స్మరించుకుంటూ.. ఈ పండుగ జరుపుకుంటారన్నారు. పేద, ధనిక తారతమ్యాలు లేకుండా రాగద్వేషాలకు అతీతంగా ముస్లింలందరూ ఈ పండుగను భక్తిశ్రద్ధలతో నిర్వహించుకుంటారన్నారు. అల్లాహ్ ఆశీస్సులు ప్రజలందరికీ ఎల్లప్పుడూ ఉండాలని వైయస్ జగన్ అభిలషించారు.