విజయవాడ నగరంలో వైయస్ఆర్‌సీపీ కార్యకర్తలు, నాయకులు, సానుభూతిపరుల ఇళ్లు, వాహనాలు, కార్యాలయాలపై టీడీపీ నాయకులు, కార్యకర్తల దాడులు కొనసాగుతున్నాయి. అజిత్‌సింగ్‌నగర్‌లోవైయస్ఆర్‌సీపీ కార్యకర్త జహీర్‌బాషాకు చెందిన టైలరింగ్ దుకాణాన్ని టీడీపీ కార్యకర్తలు ధ్వంసం చేశారు. ఆదివారం మాజీమంత్రి జోగి రమేష్ ఇంటిపై టీడీపీ, జనసేన కార్యకర్తలు దాడికి పాల్పడ్డారు. ఇబ్రహీంపట్నం ఫెర్రీ రోడ్డులోని జోగిరమేష్ ఇంటి పై రాళ్లు రువ్విన టీడీపీ , జనసేన అల్లరిమూకలు. AP 39 KD 3267 కారులో వచ్చిన టీడీపీ ,జనసేన అల్లరిమూకలు . జోగిరమేష్ ఇంటిముందే కారు ఆపి తమతో తెచ్చుకున్న రాళ్లను ఇంటి పైకి విసిరారు.