ఐదేళ్ల పాటు కుట్రలు, కుతంత్రాలతో సాగిన మోసాల ప్రభుత్వం పోయిందని. ఇప్పుడు మాట నిలబెట్టుకునే ప్రభుత్వం వచ్చిందని రాప్తాడు ఎమ్మెల్యే పరిటాల సునీత అన్నారు. అనంతపురంలోని తన నివాసంలో మీడియాతో సోమవారం మాట్లాడారు. ఎన్నికల ముందు చెప్పినట్టుగానే ఐదు కీలకహామీలు నెరవేరుస్తూ సీఎం చంద్రబాబు ఐదు ఫైల్ పై సంతకాలు చేశారన్నారు. పదవీ బాధ్యతలు చేపట్టిన రోజు ఆయన హామీలు నెరవేర్చడం ప్రారంభించారన్నారు.