మంగళవారం మంత్రి సత్య కుమార్ ధర్మవరంలో పర్యటించనున్నారు. తొలుత కదిరి గేటు వద్దనున్న చేనేత విగ్రహానికి పూలమాల వేసి అక్కడి నుంచి దిమ్మెల సెంటర్ మీదుగా తేరుబజారుకు వెళతారు. అనంతరం దుర్గమ్మగుడిలో ప్రత్యేకపూజలు నిర్వహిస్తారు. అక్కణ్నుంచి కళాజ్యోతి సర్కిల్లో అంబేడ్కర్ విగ్రహానికి పూలమాలలతో నివాళులర్పిస్తారు. మారుతీనగర్ లో నూతనంగా నిర్మించిన ప్రభుత్వాసుపత్రి ఆవరణలో మొక్కలు నాటే కార్యక్రమంలో పాల్గొంటారు.