వైసీపీ ప్రభుత్వంలో తమకు చాలా అన్యాయం జరిగిందని.. తమను దొంగలుగా చిత్రీకరించారని తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి వెల్లడించారు. తననూ.. తన కొడుకును జైలుకు పంపారన్నారు. సుప్రీంకోర్టు నిబంధనల మేరకే బీఎస్-4 వాహనాలను కొనుగోలు చేశామని, బీఎస్-4 వాహనాలను అమ్మిన వాళ్లదే తప్పు అని కోర్టు తీర్పు చెప్పిందన్నారు. పంజాబ్, తమిళనాడు, మధ్యప్రదేశ్ రాష్ట్రాలలో అమ్మిన వాహనాలను సరెండర్ చేశారని ప్రభాకర్ రెడ్డి పేర్కొన్నారు. రిజిస్ట్రేషన్ చేసిన అధికారుల ఉద్యోగాలు పోయాయన్నారు. ఏపీలో మాత్రం వాహనాలు కొన్న తమపై కేసులు పెట్టి జైలుకు పంపారని వాపోయారు. ఏ తప్పు చేయకపోయినా అర్ధరాత్రి తమను అరెస్టు చేశారని జేసీ ప్రభాకర్ రెడ్డి తెలిపారు.