రాష్ట్రంలో ‘ఆడుదాం ఆంధ్ర’ పేరుతో రూ.500 కోట్ల దోపిడీ జరిగిందని జనసేన కార్పొరేటర్ పీతల మూర్తియాదవ్ ఆరోపించారు. ‘‘జగన్మోహన్‌రెడ్డి, రోజా, బైరెడ్డి సిద్ధార్థరెడ్డి కలసి ‘ఆడుదాం ఆంధ్ర’ పేరుతో భారీ కుంభకోణానికి పాల్పడ్డారు. ప్రభుత్వం కేటాయించిన నిధులు రూ.120 కోట్లు కాగా, స్పాన్సర్ల నుంచి రూ.500 కోట్ల వరకు వసూలు చేశారు. పులివెందులలో రూ.6 కోట్లతో పూర్తయ్యే మైదానానికి రూ.20 కోట్లు ఖర్చు చేసినట్టు చూపించారు. ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ నిధులు కాజేసేందుకు కుట్ర చేస్తున్నారు’ అని మూర్తి యాదవ్ ఆరోపించారు.
![]() |
![]() |