కోన్ ఐస్‌క్రీమ్‌లో వేలు వచ్చిన ఘటన తీవ్ర దుమారం రేపింది. ముంబైకి చెందిన డాక్టర్ ఆన్ లైన్‌లో ఐస్ క్రీమ్ ఆర్డర్ చేయగా, అందులో ఒకదానిలో వేలు కనిపించింది. ఆ వేలు ఎవరిదనే అంశంపై దాదాపు క్లారిటీ వచ్చింది. పుణే ఐస్ క్రీమ్ ఫ్యాక్టరీలో పనిచేసే ఓ ఉద్యోగి వేలు అయి ఉండొచ్చని పోలీసులు భావిస్తున్నారు. ఆ వ్యక్తి వేలికి ఇటీవల గాయం అయ్యింది. ఐస్ క్రీమ్‌లో కనిపించిన వేలు ఇతనిదేనని పోలీసులు సందేహిస్తున్నారు. ధృవీకరించేందుకు ఉద్యోగి డీఎన్ఏ శాంపిల్‌ను ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరికి పంపించారు. ఆ నివేదికను బట్టి ఆ వేలు ఎవరిదనే అంశంపై స్పష్టత రానుంది.
![]() |
![]() |