శ్రీసత్య సాయి జిల్లా పెనుగొండ నియోజకవర్గం రొద్దం మండలం తురకలపట్నం గ్రామంలో సవితమ్మ యువ సైన్యం శివానంద ఆధ్వర్యంలో స్కూల్ విద్యార్థులకు బుధవారం నోట్ పుస్తకాలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీటీసీ, రొద్దం మండల క్లస్టర్ ఇంచార్జ్ కె. నాగేంద్ర, గాజుల శ్రీరామ్, ప్రశాంత్ నాయుడు, రవి, రామాంజి, హనుమంత్, నరసింహ, నాగరాజు, టైలర్ వెంకటరమణ, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.