ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఈరోజు ప్రపంచ యోగా దినోత్సవం

national |  Suryaa Desk  | Published : Fri, Jun 21, 2024, 10:19 AM

భారతదేశం (India) అనగానే గుర్తొచ్చే వాటిలో యోగా (Yoga) ఒకటి. ఒకప్పుడు మనేశంలోనే దీన్ని చేసేవారు. కానీ ఇప్పుడు ప్రపంచదేశాలు అన్నీ దీన్ని ఫాలో అవుతున్నాయి.దానికి గుర్తుగానే అంతర్జాతీయ యోగా డే కడా చేసుకుంటున్నారు. రతీ సంవత్సరం జూన్‌21న ప్రపంచ యోగా దినం సెలబ్రేట్ చేసకుంటారు.మోదీ (PM Modi) భారత ప్రధానిగా అయ్యాక యోగాకు మరింత ప్రాచుర్యం కల్పించారు. దానికి ఆయన చాలా విశిష్ట స్థానాన్ని ఇచ్చారు. 2014 సెప్టెంబర్ 27న యోగా డేని జరుపుకోవాలని ప్రతిపాదించారు. ఈ తీర్మానానికి 193 ఐరాస ప్రతినిధులలో 175 మంది మద్దతు ఇచ్చారు. అప్పటి నుంచి ప్రపంచయోగా దినోత్సవాన్ని జరుపుకుంటున్నారు. యోగా ప్రపంచాన్ని ఏకం చేసిందని మోదీ అంటారు. ప్రాీన భారతీయ సంప్రదాయం తాలూకా అమూల్యమైన బహుమతి యోగా అని చెబుతారు.


ప్రాచీన యోగా…


 


భారతదేశంలో యోగా 5,000 సంవత్సరాల క్రితమే పుట్టింది అంటారు. ఇందులో శారీరక భంగిమలు, శ్వాస వ్యాయామాలు ఇంకా ధ్యానాన్ని కలగలసి ఉంటుంది. రుగ్వేదం లాంటి ప్రాచీన గ్రంథాలు యోగాభ్యాసాలను ప్రస్తావించాయి. శతాబ్దాలుగా, ఇది వివిధ సంప్రదాయాలు, ఆలోచనల నుచి పుట్టుకొచ్చింది. కానీ 20వ శతాబ్దంలోనే దీనికి అత్యంత ప్రాచుర్యం వచ్చింది. యోగా ప్రపంచవ్యాప్తంగా ప్రజాదరణ పొందింది. స్వామి వివేకానంద మరియు BKS అయ్యంగార్ వంటి ప్రభావవంతమైన వ్యక్తులు యోగాను పశ్చిమ దేశాలకు వ్యాప్తి చేయడంలో కీలక పాత్ర పోషించారు. నేడు, లక్షలాది మంది యోగాను దాని శారీరక, మానసిక మరియు ఆధ్యాత్మిక ప్రయోజనాల కోసం అభ్యసిస్తున్నారు.


యోగాతో ఆరోగ్యం..


యోగా వలన ఆరోగ్యం బాగుపడుతుంది. శరీరం ఫ్లెక్స్‌బుల్‌గా ఉంటుంది. ప్రయోజనాలను అందిస్తుంది. ఇది వశ్యత, బలం మరియు సమతుల్యతను మెరుగుపరుస్తుంది. రోజూవారీ పని ఒత్తిడి, ఆందోళన నిరాశకు మానసిక ఒత్తిళ్లకు మంచి ఔషధంగా యోగా పనిచేస్తుంది. గుండె ఆరోగ్యంగా పనిచేసేందుకు, దీర్ఘకాలిక నొప్పులనుంచి విముక్తి పొందేందుకు,యోగా ఒక చక్కటి సాధనంగా పనిచేస్తుందని వైద్య అధ్యయనాలు చెబుతున్నాయి. ఇందులో రకరకాల ఆసనాల వల్ల శరీరంలో ప్రతీ భాగం శక్తిమంతమవుతుంది. అందుకే డాక్టర్లు కూడా చాలామంది యోగా చేయమని చెబుతారు. ఇది మెదడుకు కూడా మంచి ఆరోగ్యాన్ని ఇస్తుంది. జ్ఞాపకశక్తిని పెంచుతుంది. కాన్సన్‌ట్రేషన్ కుదురుతుంది.


ఈ ఏడాది థీమ్..


ఈ ఇయర్ ప్రపంచ యోగా దినోత్సవాన్ని జరుపుకోవడానికి ప్రధాని మోదీ శ్రీనగర్ (Srinagar) వెళుతున్నారు. అక్కడ జరగనున్న కార్యక్రమంలో ఆయన పాల్గొంటారు. ప్రతీ సంత్సం యోగా దినోత్సవానికి ఒక థీమ్ తీసుకుంటారు. ఈ ఏడాది అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా యోగా ఫర్ సెల్ఫ్ అండ్ సొసైటీ అన్న థీమ్ ను తీసుకున్నారు. అంటే యోగ మన కోసం మరియు మన సొసైటీ కోసం అన్న థీమ్ తో ప్రతి ఒక్కరు యోగ సాధన చేయాల్సిన అవసరాన్ని చెబుతున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com