విద్యతోనే గిరిజనల అభివృద్ధి సాధ్యమని, అందుకు రాష్ట్ర ప్రభుత్వం విద్యకు ప్రాముఖ్యం ఇస్తోందని ఎస్టీ కమిషన్ సభ్యుడు వాడిత్య శంకర్ నాయక్ పేర్కొన్నారు. గురువారం కర్నూలులో విలేకరులతో ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం గిరిజనుల అభివృద్ధి కోసం ఎన్నో సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి, గిరిజనులను అభివృద్ధి పథంలో నడిపిస్తోందని అన్నారు. జిల్లా పర్యటనలో గిరిజనుల నుంచి కొన్ని విజ్ఞాపనలు వచ్చాయని తెలిపారు.