శపథాలు చేయడం.. సవాళ్లు విసరడమనేది రాజకీయాల్లో సర్వసాధారణం. అయితే దానిని నెరవేర్చుకోవడమే చాలా కష్టం. అది కొందరికి మాత్రమే సాధ్యమవుతుంది. మనం ఒకసారి ఫ్లాష్ బ్యాక్‌లోకి వెళితే.. 2021 నవంబర్ 19న అప్పటి ప్రతిపక్ష నేతగా ఉన్న చంద్రబాబు ఓ శపథం చేశారు. దానిని నెరవేర్చుకుని నేడు అసెంబ్లీలో అడుగు పెట్టబోతున్నారు. ఇంతకీ ఆ శపథం ఏంటంటారా? అసెంబ్లీలో అడుగు పెడితే ముఖ్యమంత్రిగానే అడుగు పెడతానన్నారు. ఆ శపథాన్ని చంద్రబాబు నేడు నెరవేర్చనున్నారు. నేటి నుంచి రెండు రోజులపాటు ఏపీ అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నాయి.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa