ఎన్నికల సమయంలో ఎన్నికల కమిషన్ సూచనలమేరకు గురై డీజీపీ పదవి కోల్పోయిన కేవీ రాజేంద్రనాథ్‌రెడ్డికి, సీఐడీ మాజీ చీఫ్ పీవీ సునీల్‌కుమార్‌కు, ఎస్పీ రిశాంత్‌రెడ్డికి ప్రభుత్వం గట్టి షాకిచ్చింది. ప్రస్తుతం ఏసీబీ డీజీగా ఉన్న రాజేంద్రనాథ్‌రెడ్డిని ప్రింటింగ్-స్టేషనరీ విభాగం కమిషనర్‌గా బదిలీచేసింది. ఏపీఎ్‌సపీ అదనపు డీజీ అతుల్ సింగ్‌కు అదనంగా ఏసీబీ బాధ్యతలు అప్పగించింది. ఇక సీఐడీ మాజీ చీఫ్, ప్రస్తుతం అగ్నిమాపక సర్వీసుల డీజీగా ఉన్న పీవీ సునీల్‌కుమార్‌ను కూడా తప్పించింది. ఆయనకు ఏ పోస్టూ ఇవ్వకుండా సాధారణ పరిపాలన విభాగం (జీఏడీ)లో రిపోర్టు చేయాలని ఆదేశించింది. ఈ మేరకు సీఎస్ నీరబ్‌కుమార్ ప్రసాద్ గురువారం రాత్రి ఉత్తర్వులు జారీచేశారు. ఫైర్ విభాగం అదనపు బాధ్యతలను శాంతిభద్రతల అదనపు డీజీ శంఖబ్రత బాగ్చీకి అప్పగించింది. అలాగే నాటి చిత్తూరు ఎస్పీ రిశాంత్‌రెడ్డి పైనా వేటు పడింది. కౌంటర్ ఇంటెలిజెన్స్ ఎస్పీగా ఆయన్ను తొలగించారు. ఎర్రచందనం టాస్క్‌ఫోర్స్ ఎస్పీగా అదనపు బాధ్యతల నుంచీ ఆయన్ను రిలీవ్‌చేసి.. జీఏడీలో రిపోర్టు చేయాలని సీఎస్ ఆదేశించారు. ఈ రెండు పోస్టుల భర్తీకి డీజీపీ తగు చర్యలు తీసుకోవాలని సూచించారు. కొద్ది రోజుల్లో మరికొందరు ఐపీఎస్ అధికారులను బదిలీచేసే అవకాశముంది.