ప్రజలతో మమేకమై 24 గంటలూ విధుల్లో రెవెన్యూ సిబ్బంది ఉంటారని, వారి సేవలు నిరుపమానమని కృష్ణా జిల్లా, కలెక్టర్ డీకే బాలాజీ అన్నారు. కంకిపాడు తహసీల్దార్ కార్యాలయంలో రెవెన్యూ దినోత్సవం సందర్భంగా నిర్వహించిన కార్యక్ర మంలో గురువారం ఆయన మాట్లాడారు. రెవెన్యూ శాఖలో విధులు నిర్వహించి పదవీ విరమణ చేసిన టి.శివనాగేశ్వరరావు, ఆర్.రమాదేవి, ఏసుపాదం, పి.రామకృష్ణను సత్కరించారు. ఉయ్యూరు డివిజన్ అధికారి డి.రాజు, జిల్లా పంచాయతీ అధికారి నాగేశ్వరనాయక్, తహసీల్దార్ ఎం.రామకృష్ణ, ఎంపీడీవో అనూష, రెవెన్యూ సంఘం అధ్యక్ష, కార్యదర్శులు విజయ్, ఏడుకొండలు, మద్దూరు రఘురామప్రసాద్ పాల్గొన్నారు.