లేపాక్షి మండల వ్యాప్తంగా 2023 ఏప్రిల్ 1 నుంచి 2024 మే 31వ తేదీ వరకూ జరిగిన ఉపాధి హామీ పనులను శనివారం నుంచి సామాజిక తనిఖీ బృందం క్షేత్రస్థాయిలో పరిశీలిస్తుందని ఎంపీడీఓ వాసు దేవ గుప్తా శుక్రవారం తెలిపారు. 18వ సామాజిక తనిఖీలో భాగంగా ఉపాధి పను లను తనిఖీ చేస్తారన్నారు. మండల వ్యాప్తంగా హార్టికల్చర్, రింగ్ ఫ్రెంచ్, ఫారంపాండ్లు, ఫీడరాచా నల్స్, డగౌట్ పాండ్లు, బౌండరీ స్ట్రెంచ్లు తదితర పనులు జరిగాయన్నారు.