అవినీతి రహిత పాలన అందించడమే నా ధ్యేయమని, నిబంధనలకు విరుద్దంగా ప్రభుత్వ అధికారులు, సిబ్బంది నడుచుకుంటే వేటు తప్పదని ఎమ్మెల్యే వరదరాజులరెడ్డి హెచ్చరించారు. ప్రొద్దుటూరు స్థానిక మున్సిపల్ కార్యా లయంలో ఇంజనీరింగ్ శానిటేషన్ రెవెన్యూ అధికారులతో సమీక్షించిన ఆయన తనశైలిలో అధికారులకు పలురకాల సూచనలు, హెచ్చరిక లు జారీ చేశారు. మురుగునీటి వ్యవస్థ ప్రక్షాళన అత్యంత ప్రాధాన్యత గల అంశమ న్నారు. రూ.163 కోట్లతో కాల్వల ఆధునీకరణ లో అన్ని కాల్వలు వున్నాయాఅని ప్రశ్నించా రు. గత పాలకులు కాల్వల్లో పూడిక తీత ఎన్నిమార్లు తీసి బిల్లులు చేసుకున్నారని ప్రశ్నించారు. వర్షాకాలం కాబట్టి తక్షణం రోడ్లపై నీళ్ళు ప్రవహించకుండా పూడిక తీత పనులను చేపట్టాలన్నారు. టౌన్ ప్లానింగ్ ఏసీపీ మునిరత్నం పనితీరుపై తీవ్ర అభ్యత రం వ్యక్తం చేశారు. నీవు చాలా అవినీతి పరుడవని నీ చిట్టా అంతా నా దగ్గర వుంద ని హెచ్చరించారు. గత పాలనలో జరిగిన అభివృద్ధి పనులు మీదే కాకుండా టౌన్‌ప్లా నింగ్‌లో ఇచ్చిన అనుమతులు, రెవెన్యూలో వేసిన పన్నులు వీటన్నింటిపై విజిలెన్సుతో విచారణ జరిపిస్తానన్నారు. శానిటేషన్ వర్క ర్లుగా జీతాలు తీసుకుంటూ ఆ పనులు చే యకుండా ఆఫీసుల్లో అధికారులు, నేతల ఇళ్లలో ఇతర చోట్ల పనిచేస్తూ వుండే వారిపై చర్యలు తీసుకోమని కమిషనర్ రఘు నాధరెడ్డిని ఆదేశించారు.పనిచేయకుండా జీతాలు తీసుకుంటున్న వారిని తొ లగించాలన్నారు. ఆర్‌ఐ శివచర ణ్ శానిటరీ ఇన్‌స్పెక్టర్ కిరణ్, మాజీ ఎమ్మెల్యే రాచమల్లు, ఆయ న బావమరిది బంగారురెడ్డికి అనుకూలంగా వ్యవరించారని ఇప్పటికైనా పద్దతి మార్చుకుని మీ ఉద్యోగాలు మీరు చేయాలని హెచ్చరించారు. అధికారులు ప్ర భుత్వం నుంచి జీతం తీసుకుం టూ పనిచేయాలన్నారు. అవినీతి డబ్బుకోసం పాకులాడకూడదన్నారు. ఎప్పు డు ఏ ఫైలు వస్తుందా అందులో ఎంత గుంజుదామా అనే ఆలోచనలు ఇప్పటి నుం చే విరమించుకుని పనిచేయాలన్నారు. కమి షనర్ కూడా ఆఫీసుకు పరిమితం కాకుండా క్షేత్ర స్థాయిలో పరిశీలించాలన్నారు.